Anantapur: వైఎస్ జగన్‌ను కలిసి పామిడి వైఎస్సార్‌సీపీ నాయకులు
Anantapur: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను కలిసిన పామిడి నాయకులు. బలోపేతంపై చర్చ.
Anantapur: వైఎస్ జగన్‌ను కలిసి పామిడి వైఎస్సార్‌సీపీ నాయకులు
అనంతపూర్: అనంతపురం జిల్లా పామిడి పట్టణానికి చెందిన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడి పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలోని సమస్యలు, రాబోయే పార్టీ కార్యక్రమాలపై నాయకులు జగన్ గారితో చర్చించారు.
పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, పామిడి పట్టణ మరియు మండలంలో వైఎస్ఆర్సిపి పార్టీని మరింత బలోపేతం చేయాలని జగన్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పామిడి పట్టణ అధ్యక్షులు నాగూర్ ఈశ్వర్ రెడ్డి, అనంతపురం జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సూరి వాల్మీకి, పామిడి పట్టణ ఉపాధ్యక్షులు తుల్లా భాయ్, సల్లుద్దీన్, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఎర్ర గౌస్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల రామచంద్ర వాల్మీకి, డీలర్ రమణ వాల్మీకి, 13వ వార్డు మహేశ్వర్ రెడ్డి, టౌన్ ప్రధాన కార్యదర్శి విభూది కాశీం, పామిడి వైఎస్ఆర్సిపి స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ జిలాన్, హరి మహారాజ్, సోషల్ మీడియా ఉదయ్, వెంకటేష్ అలియాస్ కప్ప, వెంకీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.




