Anantapur: అనంతపురం చిన్నారి ప్రాణం కాపాడండి దాతలకు విజ్ఞప్తి

Anantapur: ఎస్ఎంఏ టైప్-1 వ్యాధితో పోరాడుతున్న 3 నెలల బాబు శ్యామ్ నందన్. రూ.17 కోట్ల ఇంజెక్షన్ కోసం సాయం కోరుతున్న తల్లిదండ్రులు. ప్రభుత్వం, దాతలు స్పందించాలి.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 18 July 2026 3:35 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురం చిన్నారి ప్రాణం కాపాడండి దాతలకు విజ్ఞప్తి

అనంతపూర్: అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ మూడు నెలల చిన్నారిని కాపాడుకోవడానికి దాతలు, ప్రభుత్వం స్పందించి సహాయం చేయాలని ఓ మధ్యతరగతి దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

అనంతపురం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాధితులు తమ ఆవేదనను పంచుకున్నారు. అనంతపురం జిల్లా, పెద్దవడుగూరు మండలం, కదరగుట్టపల్లి గ్రామానికి చెందిన నవీన్ కుమార్, హిందుప్రియ దంపతులకు శ్యామ్ నందన్ అనే మూడు నెలల బాబు ఉన్నాడు. అయితే ఆ బాబు ప్రస్తుతం 'ఎస్ఎంఎ టైప్-1' (Spinal Muscular Atrophy) అనే ప్రాణాంతకమైన అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్నాడు.

ఈ వ్యాధి నయమవ్వాలంటే దాదాపు రూ. 17 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తెలిపినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. అంతటి భారీ మొత్తాన్ని భరించే శక్తి లేని తాము, తమ బిడ్డను కాపాడుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని వారు వేడుకుంటున్నారు.

ఇప్పటికే ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లామని వివరించిన దంపతులు... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరియు మంత్రి నారా లోకేష్ స్పందించి మానవతా దృక్పథంతో తమకు ఆర్థిక సహాయం అందించి, చిన్నారి ప్రాణాలను కాపాడాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు. అలాగే సమాజంలోని దాతలు సైతం తమ వంతు సహాయం అందించి బాబును ఆదుకోవాలని కోరారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story