Anantapur: సర్వజనాసుపత్రికి స్ట్రెచర్లు అందజేసిన పరిటాల శ్రీరామ్
Anantapur: అనంతపురం సర్వజనాసుపత్రికి పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా స్ట్రెచర్లను పరిటాల శ్రీరామ్ అందజేశారు. దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Anantapur: సర్వజనాసుపత్రికి స్ట్రెచర్లు అందజేసిన పరిటాల శ్రీరామ్
అనంతపూర్: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని సర్వజనాసుపత్రికి పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్ట్రెచర్లను అందజేశారు.మంగళవారం సాయంత్రం పరిటాల శ్రీరామ్ స్వయంగా ఆసుపత్రికి చేరుకుని సూపరింటెండెంట్, వైద్యాధికారులకు స్ట్రెచర్లను అందించారు.
ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని సర్వజనాసుపత్రికి రోగుల తాకిడి అధికంగా ఉంటుందని తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారు చికిత్స కోసం ఆసుపత్రికి వస్తుంటారని చెప్పారు.రోగులకు అవసరమైన సదుపాయాల కల్పనలో స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆసుపత్రికి స్ట్రెచర్లు అందించడం ద్వారా రోగులకు ఎంతో
ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకుడు నరేంద్ర ముందుకు వచ్చి పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా స్ట్రెచర్లు అందించేందుకు సహకరించారని శ్రీరామ్ పేర్కొన్నారు.
పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గతంలో ఉచిత వివాహాలు, రక్తదాన శిబిరాలు, తదితర అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తుచేశారు. ప్రజలకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా ట్రస్ట్ ద్వారా సహాయం చేసేందుకు ఎప్పుడూముందుంటామని పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు.




