Anantapur: అనంతపురం రాప్తాడు పాఠశాలలో ఉన్మాది దాడి ఘటన తీవ్ర ఖండన!
Anantapur: అనంతపురం రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనను ఖండించిన పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బాబావలి. పాఠశాలల్లో భద్రత కల్పించాలని డిమాండ్.
Anantapur: అనంతపురం రాప్తాడు పాఠశాలలో ఉన్మాది దాడి ఘటన తీవ్ర ఖండన!
Anantapur: అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో చోటుచేసుకున్న ఉన్మాది దాడి ఘటనను పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు బాబావలి తీవ్రంగా ఖండించారు. తరగతి గదిలోకి చొరబడిన ఉన్మాది విద్యార్థినిపై రంపంతో దాడి చేయడంతో పాటు, అడ్డొచ్చిన మరో విద్యార్థినిపై కూడా దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనలకు గురై కన్నీళ్లు పెట్టుకోవడం హృదయవిదారకమని అన్నారు. పాఠశాలల్లోనే విద్యార్థులకు రక్షణ లేకపోవడం ప్రభుత్వ భద్రతా వైఫల్యాలకు నిదర్శనమని విమర్శించారు.
ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపి దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు.
విద్యార్థుల ప్రాణాలకు భరోసా కల్పించలేని విద్యావ్యవస్థ ఎవరి కోసం? ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని బాబావలి డిమాండ్ చేశారు.




