Anantapur: ఇకపై పోలీస్ స్టేషన్ గడప తొక్కక్కర్లేదు.. ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేయండి!
Anantapur: అనంతపురంలో 'ఏఐ ప్రజావాణి' ప్రారంభం. ఇకపై పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
Anantapur: ఇకపై పోలీస్ స్టేషన్ గడప తొక్కక్కర్లేదు.. ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేయండి!
Anantapur: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే బాధితులు ఫిర్యాదు చేయవచ్చని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు అనంతపురంలోని ఎస్పీ కార్యాలయంలో ఏఐ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి బాధితుడు నేరుగా ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పోలీస్ స్టేషన్లో తమ ఫిర్యాదులను తీసుకోలేదని బాధితులు తమ దృష్టికి చాలాసార్లు తెచ్చారన్నారు ఈ సమస్యను పరిష్కరించడం కోసమే పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా బాధితుడే ఏఐ ప్రజావాణి లో తమ సమస్యను పేర్కొనవచ్చు అని చెప్పారు.
ఏఐ ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేస్తేనే వెంటనే ఆక్లాన్మెంట్ కార్డుతో సహా ఏ టైం లో ఫిర్యాదు చేశారు ఆయా పోలీస్ స్టేషన్ లకు వెళుతుందని తెలిపారు అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు అనంతరం అన్ని పోలీస్ స్టేషన్లలో అమలు అయ్యేలా చూస్తామని ఎస్పీ చెప్పారు.




