Anantapur: అనంతపురంలో దగ్ధమైన ప్రైవేట్ బస్సు - తప్పిన పెను ప్రమాదం!

Anantapur: అనంతపురం పెద్దవడుగూరు వద్ద జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో 33 మంది ప్రయాణికులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 4 Sept 2026 8:01 AM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో దగ్ధమైన ప్రైవేట్ బస్సు - తప్పిన పెను ప్రమాదం!

Anantapur: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీగా మంటలు చెలరేగాయి.

వింటర్ సిటీ సర్వీసెస్ కు చెందిన TG13T 1985 నంబర్ గల బస్సులో శుక్రవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ సిద్దయ్య స్వామి వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. దీంతో బస్సులో ఉన్న 33 మంది ప్రయాణికులు సురక్షితంగా కిందకు దిగి ప్రాణాలతో బయటపడ్డారు.

మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పెద్దవడుగూరు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. మంటలు చెలరేగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story