Rayadurg: గ్రామాభివృద్ధి లక్ష్యంతో సర్పంచ్ పోటీలో మాజీ సైనికుడు నగేష్ రెడ్డి!

Rayadurg: బీఎస్ఎఫ్‌లో 20 ఏళ్లు దేశానికి సేవలందించిన హులికల్లు మాజీ సైనికుడు నగేష్ రెడ్డి, టీడీపీ మద్దతుతో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 24 Nov 2026 2:06 PM IST
Rayadurg
X

Rayadurg: గ్రామాభివృద్ధి లక్ష్యంతో సర్పంచ్ పోటీలో మాజీ సైనికుడు నగేష్ రెడ్డి!

రాయదుర్గ్: 20 ఏళ్ల పాటు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో దేశానికి సేవలందించి ప్రస్తుతం ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో టిడిపి పార్టీ బలపరిచిన వ్యక్తిగా హులికల్లు గ్రామానికి చెందిన మాజీ సైనికుడు నగేష్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కనేకల్ మండలం నల్లంపల్లి పుల్లంపల్లి హు లికేరా గ్రామాల్లో చేస్తున్న ప్రచారానికి ప్రజల్లో ఈయనకు అనువః స్పందన లభిస్తుంది. 2002లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో చేరినయిన 2022లో పదవి విరమణ తీసుకున్నారు.

అనంతరం పులికేర గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. సొంత నిధులతో ఆరో ప్లాంట్ నిర్మించి తాగునీటి సమస్య పరిష్కారాన్ని కృషి చేశారు. ప్రస్తుతం టిడిపి పార్టీ బలపరిచిన వ్యక్తిగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రజలు తనను ఖండమైన మెజార్టీతో గెలిపిస్తే ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు సహకారంతో గ్రామంలో సిసి రోడ్లు, శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి చేయడంతోపాటు గ్రామాభివృద్ధికి కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు.

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM