Anantapur: అనంతపురం రూరల్ ఎంపీపీగా చల్లా జయకృష్ణ ప్రమాణ స్వీకారం!

Anantapur: అనంతపురం రూరల్ ఎంపీపీగా చల్లా జయకృష్ణ, వైస్ ఎంపీపీగా ఉదయ్ శంకర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలాభివృద్ధికి సమష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 19 Nov 2026 5:31 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురం రూరల్ ఎంపీపీగా చల్లా జయకృష్ణ ప్రమాణ స్వీకారం!

అనంతపురం: అనంతపురం రూరల్ మండల సమగ్ర అభివృద్ధికి నూతన ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో పనిచేయాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పిలుపునిచ్చారు.అనంతపురం రూరల్ మండల ఎంపీడీవో కార్యాలయంలో నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రూరల్ మండల ఎంపీపీగా చల్లా జయకృష్ణ, వైస్ ఎంపీపీగా ఉదయ్ శంకర్ ప్రమాణ స్వీకారం చేశారు.నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు సైతం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నూతన ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తూ, రూరల్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM