Tadipatri: తాడిపత్రి 25వ వార్డులో వీధి దీపాల మరమ్మతులు పూర్తి!

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ 25వ వార్డు టైలర్స్ కాలనీలో పనిచేయని వీధి దీపాలకు మరమ్మతులు చేయించడంతో పాటు కౌన్సిలర్లు నూతన లైట్లు ఏర్పాటు చేయించారు.

Surya Prakash, Tadipatri
Published on: 26 Nov 2026 1:52 PM IST
Tadipatri
X

Tadipatri: తాడిపత్రి 25వ వార్డులో వీధి దీపాల మరమ్మతులు పూర్తి!

తాడిపత్రి: తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న వీధి దీపాల సమస్యకు కౌన్సిలర్లు పరిష్కారం చూపించారు. 25వ వార్డు పరిధిలోని టైలర్స్ కాలనీలో గత కొద్ది రోజులుగా పనిచేయకుండా ఉన్న వీధి దీపాలతో పాటు, కొన్ని వీధుల్లో అసలు వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా చీకటి కారణంగా విషపురుగులు, పాములు సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్న విషయాన్ని గుర్తించిన 25వ వార్డు కౌన్సిలర్ పోతుల గంగాధర్ యాదవ్, 24వ వార్డు కౌన్సిలర్ టింకర్ హుస్సేన్ భాష, 23వ వార్డు కౌన్సిలర్ టింకర్ హబీబుల్లా ఈ సమస్యను తాడిపత్రి MLA జేసీ అస్మిత్ రెడ్డి , మాజీ MLA జేసీ ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

వారి సూచనలు, సహకారంతో నేడు మూడు వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో టైలర్స్ కాలనీలో పనిచేయని వీధి దీపాలకు మరమ్మతులు చేయించడంతో పాటు, వీధి దీపాలు అవసరమైన ప్రాంతాల్లో నూతన లైట్లను ఏర్పాటు చేశారు. దీంతో కాలనీ వీధులు వెలుగులతో నిండగా, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ.. "ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఎవరైనా వచ్చి చెప్పే వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడం, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం మా బాధ్యత. ప్రజల భద్రత, సౌకర్యాలే మా ప్రథమ ప్రాధాన్యత. వార్డులో ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారుల సహకారంతో వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తాం" అని తెలిపారు.

గత కొద్ది రోజులుగా చీకటితో ఇబ్బందులు పడుతున్న తమ సమస్యను గుర్తించి, వెంటనే స్పందించి వీధి దీపాలను మరమ్మతులు చేయించిన కౌన్సిలర్లు పోతుల గంగాధర్ యాదవ్, టింకర్ హుస్సేన్ భాష, టింకర్ హబీబుల్లాకు టైలర్స్ కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల మధ్యే ఉంటూ.. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కౌన్సిలర్ల కృషిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Surya Prakash, Tadipatri

Surya Prakash, Tadipatri