Anantapur: అనంతపురం టవర్ క్లాక్ వద్ద టీడీపీ శ్రేణుల ఘన వేడుకలు
Anantapur: అనంతపురం టవర్ క్లాక్ వద్ద సిఎమ్ చంద్రబాబు, లోకేష్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చిత్రపటాలకు పాలభిషేకం చేసిన టీడీపీ శ్రేణులు. బిసిలకు గుర్తింపుపై హర్షం.
Anantapur: అనంతపురం టవర్ క్లాక్ వద్ద టీడీపీ శ్రేణుల ఘన వేడుకలు
అనంతపూర్: అనంతపురం స్థానిక టవర్ క్లాక్ సమీపంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు, కార్యకర్తలు మరియు మహిళా విభాగానికి చెందిన సభ్యులు పెద్ద ఎత్తున సమీకృతమై వేడుకలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, మరియు స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ల చిత్రపటాలకు వారు క్షీరాభిషేకం (పాలాభిషేకం) నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం పార్టీకి మరియు నేతలకు అనుకూలంగా చేసిన నినాదాలతో క్లాక్ టవర్ ప్రాంగణం మారుమోగింది.
కార్యక్రమంలో మాట్లాడిన టీడీపీ నాయకులు & మహిళల ముఖ్య కార్యకర్తలకు సరైన గుర్తింపు"తెలుగుదేశం పార్టీలో ఉండటం మాకు ఎంతో గర్వకారణం. పదవికి, కార్యకర్తకు నిజమైన అర్థం చూపిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు." గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వెనుకబడిన వర్గాలను (బీసీ) పూర్తిగా అనగదొక్కారని విమర్శించారు.
బీసీలకు మరియు మహిళలకు రిజర్వేషన్లు కేటాయించి, వారికి రాజకీయంగా మరియు సామాజికంగా ప్రాధాన్యత కల్పించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక టీడీపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.




