Anantapur: అనంతకు లక్ష కోట్ల పెట్టుబడులు.. పుట్టపర్తిలో ఫైటర్ జెట్ల తయారీ

Anantapur: అనంతపురం అర్బన్ టీడీపి కార్యాలయంలో రూ.40 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 25 May 2026 4:39 PM IST
Anantapur
X

Anantapur: అనంతకు లక్ష కోట్ల పెట్టుబడులు.. పుట్టపర్తిలో ఫైటర్ జెట్ల తయారీ

Anantapur: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ కింద 30 విడతల్లో దాదాపు 6 కోట్ల రూపాయలు అందిస్తే.. గత వైసీపీ ప్రభుత్వంలో కోటి రూపాయల కూడా ఇవ్వలేదని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎద్దేవా చేశారు. అనంతపురంలోని అర్బన్ టిడిపి కార్యాలయంలో 40 లక్షల విలువచేసే సీఎంఆర్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అందించారు. కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఎమ్మెల్యే కొనియాడారు. గత ప్రభుత్వంలో రౌడీ రాజ్యం నడిచిందని మండిపడ్డారు అరాచకాలు దౌర్జన్యాలు దాడులతో రాష్ట్ర ప్రజలను భయపెట్టాలని వైసిపి నేతలు చూశారని మండిపడ్డారు.

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పుల రాష్ట్రంగా చేస్తే చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడని కొనియాడారు. ప్రభుత్వం ఏర్పడిన 24 నెలల్లోనే 20 లక్షల ఉద్యోగాలు తీసుకువచ్చామన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ 25 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారన్నారు. అనంత జిల్లాలో దాదాపు లక్ష కోట్లకు పైగా పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పడుతున్నాయన్నారు. 5th జనరేషన్ ఫైటర్ జెట్ లు పుట్టపర్తి లో తయారు కానున్నాయనీ కొనియాడారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story