Anantapur: అనంతపురంలో రూ. 14 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

Anantapur: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 10 May 2026 1:54 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో రూ. 14 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

అనంతపూర్: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదేళ్లలో విధ్వంసం పాలన సాగిస్తే..23 నెలల కాలంలో రాష్ట్రం వికాసం వైపు అడుగుల వేస్తోందని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అర్బన్ టిడిపి కార్యాలయంలో ఆయన ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 29వ విడతలో భాగంగా 26మంది కి 14 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 23 నెలల కాలంలో ఒక్క అర్బన్ నియోజకవర్గంలోనే 5కోట్ల 64 లక్షల రూపాయల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. మొత్తం 565 మందికి ఈ సాయం అందించినట్లు చెప్పారు.

పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఎవరు కష్టంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోగ్యం విషయంలో సాయం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో ఎప్పుడూ ఇలాంటి సాయం అందలేదన్నారు. వైసీపీ నాయకులే ఈ విషయాన్ని తమతో చెబుతున్నారన్నారు. గత ఐదేళ్లలో పది లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రంలో విధ్వంసపాలన సాగించారన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story