Anantapur: 57వ ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
Anantapur: అనంతపురం అర్బన్ టీడీపీ ఆఫీసులో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 57వ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.
Anantapur: 57వ ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
అనంతపూర్: అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో 57వ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ కాలనీల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై.. తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ..ఇప్పటివరకు 57 సార్లు ప్రజా దర్బార్ నిర్వహించి, మొత్తం 1,268 అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు.
వీటిలో కేవలం 39 అర్జీలు మినహా.. మిగిలిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపించినట్లు వెల్లడించారు.గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఇలాంటి ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఎక్కడా నిర్వహించలేదని ఎమ్మెల్యే విమర్శించారు.
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎమ్మెల్యే కార్యాలయం వరకు..ప్రతి వారం గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం వినాశనం దిశగా వెళ్లిందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆరోపించారు.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలిపారు.గత ఐదేళ్ల వైసీపీ పాలనలో టన్నుల కొద్దీ చెత్తను మిగిల్చి వెళ్లారని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెత్తను పూర్తిస్థాయిలో క్లియర్ చేస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు.
అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్-1 స్థానంలో నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.




