Anantapur: డంపింగ్ యార్డ్ స్థానంలో సుందరమైన పార్కు ఎమ్మెల్యే విజ్ఞప్తి
Anantapur: ఆనంద్‌తో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యేకంగా సమావేశమై నగర అభివృద్ధి, పారిశుద్ధ్యం, వంకల రక్షణ చర్యలపై సమీక్షించారు.
Anantapur: డంపింగ్ యార్డ్ స్థానంలో సుందరమైన పార్కు ఎమ్మెల్యే విజ్ఞప్తి
అనంతపూర్: అనంతపురం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌కు వెళ్లిన ఎమ్మెల్యే, నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుద్ధ్యం మరియు డంపింగ్ యార్డ్ వంటి కీలక అంశాలపై కలెక్టర్‌తో సుదీర్ఘంగా చర్చించారు.
నగరంలో ఇప్పటికే ప్రారంభమైన అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల విడుదలకు చొరవ చూపాలని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. డంపింగ్ యార్డ్ నుండి చెత్తను వేగంగా తరలించి, అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌తో పాటు ఒక సుందరమైన పార్కు నిర్మాణానికి తక్షణమే టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను విజ్ఞప్తి చేశారు.
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నడిమి వంక, మరువ వంక పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఇరువురు చర్చించారు.ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్ని అంశాలపై కలెక్టర్ ఓ.ఆనంద్ సానుకూలంగా స్పందించారు. నగర అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేస్తామని, పారిశుద్ధ్య మెరుగుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.




