Anantapur: నా పని నేను చేసుకుంటూ పోతా.. ఎమ్మెల్యే దగ్గుపాటి!

Anantapur: టిడిపి కార్యకర్తలు నాయకుల కోసం కాకుండా పార్టీ కోసం పని చేస్తారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కొనియాడారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 31 May 2026 1:24 PM IST
Anantapur
X

Anantapur: నా పని నేను చేసుకుంటూ పోతా.. ఎమ్మెల్యే దగ్గుపాటి!

Anantapur: తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తలు నాయకులకు పని చేయరనీ.. పార్టీ కోసం పని చేస్తారనీ టిడిపి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కొనియాడారు. నగరంలోని అర్బన్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. అర్బన్ నియోజకవర్గానికి తాను కొత్త అయినప్పటికీ కార్యకర్తలే తనను గెలిపించారని చెప్పారు కార్యకర్తలు నాయకులకు పని చేయాలని కేవలం పార్టీ కోసం పని చేస్తారన్నారు. ఐదేళ్లు అవకాశం ఇచ్చారని అభివృద్ధి పై ఆలోచనలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే దాదాపు 120 కోట్లు అర్బన్ అభివృద్ధి కోసం నిధులు ఖర్చుపెట్టినట్లు చెప్పారు. ఎవరు ఏది మాట్లాడినా తన పని తాను చేసుకుంటూ పోతానని చెప్పారు. తమ అధిష్టానం అన్ని గమనిస్తోందని తెలిపారు. వైసిపి హయాంలో అరాచకాలు దౌర్జన్యాలు దోపిడీలు తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉద్యోగాలను ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానీదన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story