Anantapur: ఎన్టీఆర్ భరోసా పెన్షన్: ప్రతి లబ్ధిదారుడి ముఖంలో చిరునవ్వు!
Anantapur: గుత్తి 18వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరిగింది. కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
Anantapur: ఎన్టీఆర్ భరోసా పెన్షన్: ప్రతి లబ్ధిదారుడి ముఖంలో చిరునవ్వు!
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ - ప్రతి లబ్ధిదారుడి ముఖంలో చిరునవ్వు
- గుత్తి 18వ వార్డులో పాల్గొన్న వెంకట శివుడు యాదవ్
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం, గుత్తి మండలం, గుత్తి పట్టణం 18వ వార్డు Z వీరారెడ్డి కాలనీ*లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ – ప్రతి లబ్ధిదారుడి ముఖంలో చిరునవ్వు, ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా వెంకట శివుడు యాదవ్ మాట్లాడుతూ, "పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు మరియు ఇతర అర్హులైన ప్రతి లబ్ధిదారుడి జీవితంలో ఆర్థిక భరోసా నింపే మహత్తర సంక్షేమ కార్యక్రమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్" అని అన్నారు.
"ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం" అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు* నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.
ప్రతి నెల మొదటి తేదీనే లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్ అందించే విధానం ద్వారా ప్రభుత్వం సేవలను ప్రజల గడపకు తీసుకెళ్లిందని, వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి చేతికే పెన్షన్ అందించడం ప్రభుత్వ ప్రజా సంక్షేమానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది కేవలం నగదు సహాయం మాత్రమే కాదని, అది వృద్ధులకు ఆత్మగౌరవం, దివ్యాంగులకు ధైర్యం, వితంతువులకు భరోసా, పేద కుటుంబాలకు ఆర్థిక అండ అని అన్నారు.
"ప్రతి ఇంటికి సంక్షేమం – ప్రతి కుటుంబానికి భరోసా" అనే సంకల్పంతో అమలవుతున్న ఈ పథకం రాష్ట్ర ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిందని తెలిపారు. ఈ దిశగా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గుత్తి మండల కార్యదర్శి సుంకన్న, వార్డు ఇంచార్జి టైలర్ బాషా, మాజీ టౌన్ అధ్యక్షులు నరేంద్ర చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు సుధాకర్ నాయుడు, రాహుల్, రామాంజీ ఆచారి, నెట్టికల్లు, సుంకయ్య, వాల్మికి రాము, కొత్తపేట రాము, కొత్తపల్లి శేఖర్, ఆది శేషయ్య తో పాటు గుత్తి మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




