Anantapur: యాడికి మండలం రాయలచెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం!
Anantapur: అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువు సమీపంలో NH-67 హైవేపై నిలబడి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.
Anantapur: యాడికి మండలం రాయలచెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం!
అనంతపురం: అనంతపురం జిల్లాలో యాడికి మండలం రాయలచెరువు గ్రామ సమీపంలో NH-67 హైవేపై ఈరోజు తెల్లవారుజామున 5 గంటల 10 నిమిషాలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి హాస్పిటల్‌కు వెళ్లి, మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. రోడ్డు పక్కన నిలబడి ఉన్న లోడు లారీని, వెనుక నుంచి వస్తున్న తుఫాన్ వాహనం ఢీకొట్టింది.
ఈ ఘటనలో తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు 7 మందికి గాయాలు అయ్యాయి. మృతులు తాడిపత్రి కావేటిసముద్రం గ్రామానికి చెందిన వారు. వీరు హైదరాబాద్ లోని వివాహానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ విషాదం జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




