Anantapur: అనంతపురంలో వైఎస్సార్‌సీపీ 'AP Gen-Z' రిలే దీక్షలు ప్రారంభం!
Anantapur: అనంతపురంలో అనంత వెంకటరామిరెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ 'AP Gen-Z' దీక్షలు షురూ. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Anantapur: అనంతపురంలో వైఎస్సార్‌సీపీ 'AP Gen-Z' రిలే దీక్షలు ప్రారంభం!
అనంతపురం: నగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఏపీ జెన్ జెడ్ (AP Gen-Z) రిలే నిరాహార దీక్ష కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ దీక్షను చేపట్టారు.
ఈ కార్యక్రమంలో అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడారు. 2025 డీఎస్సీ (DSC) నిర్వహణ మరియు నియామకాలలో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చేత సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి.రాష్ట్రంలోని నిరుద్యోగులకు తక్షణమే 'నిరుద్యోగ భృతి' చెల్లించాలని, అలాగే విద్యార్థులకు నిలిచిపోయిన 'ఫీజు రీయింబర్స్మెంట్' బకాయిలను వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఈ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే, ఈ రిలే నిరాహార దీక్షలను రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ రిలే నిరాహార దీక్షా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో పాటు స్థానిక నాయకులు వసీం, బోయ గిరిజమ్మ, వాసంతి సాహిత్య మరియు పలువురు వైసీపీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




