Anantapur: అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన స్థానిక ఎన్నికల కౌంటింగ్!

Anantapur: అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ. హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపు, విజేతలకు డిక్లరేషన్ పత్రాల అందజేత.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 8 Nov 2026 12:50 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన స్థానిక ఎన్నికల కౌంటింగ్!

Anantapur: అనంతపురం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది. జిల్లాలోని మొత్తం 31 మండలాలకు గాను మూడు జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 28 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించారు.

పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు కోసం మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 11 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.అనంతపురంలోని జేఎన్టీయూ విశ్వవిద్యాలయంతో పాటు కళ్యాణదుర్గం, గుంతకల్లు ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించారు.

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీతో ఉత్కంఠగా సాగింది. చివరకు గెలుపొందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు ఎన్నికల అధికారులు డిక్లరేషన్ పత్రాలను అందజేశారు.సుదీర్ఘంగా సాగిన కౌంటింగ్ ప్రక్రియ మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటల వరకు కొనసాగింది. మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM