Anantapur: అనంతపురంలో దారుణంగా కరవు ప్రభుత్వంపై వైసిపి తీవ్ర ధ్వజం!

Anantapur: అనంతపురం జిల్లాలో కరవు పరిస్థితులపై ప్రభుత్వం స్పందించకపోవడంపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 14 Aug 2026 5:47 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో దారుణంగా కరవు ప్రభుత్వంపై వైసిపి తీవ్ర ధ్వజం!

Anantapur: అనంతపురం జిల్లాలోని తీవ్ర కరవు పరిస్థితులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లా వ్యాప్తంగా కరవు పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, గ్రామాల్లో కనీసం పశువులకు మేత కూడా దొరకని పరిస్థితులు నెలకున్నాయని తెలిపారు.పడిపోయిన విత్తన విస్తీర్ణం.రైతులు విత్తనాలు కూడా వేయలేని స్థితిలో ఉన్నారని, సాధారణ సాగుతో పోలిస్తే కేవలం 4.16 లక్షల ఎకరాల్లో మాత్రమే విత్తనాలు వేశారని ఆయన వెల్లడించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం

ఎల్ నినో ప్రభావం ఉందంటూ నెపం నెట్టివేస్తూ ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులు వేసిన కొద్దిపాటి పంటలకైనా తక్షణమే ఉచిత పంట బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

జిల్లాకు చెందిన మంత్రులు అధికారులతో సమీక్షలు కేవలం "తూతూమంత్రంగా" మాత్రమే నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాలో కరవు పరిస్థితుల గురించి ధైర్యంగా మాట్లాడే నాయకుడే కరువయ్యాడని, అధికార పార్టీ నాయకులు కేవలం రాజకీయాలు, వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారని మండిపడ్డారు.

ప్రజా సమస్యలు, జిల్లా కరవును ప్రభుత్వం వెంటనే గుర్తించి, అష్టకష్టాలు పడుతున్న రైతులను, గ్రామీణ ప్రజలను ఆదుకోవడానికి అత్యవసర చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ తరఫున డిమాండ్ చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story