Anantapur: సీమ రైతులకు 25 టీఎంసీల నీరు కేటాయించాలి వైఎస్సార్‌సీపీ నేత అనంత
Anantapur: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితులు, తీవ్ర నీటి ఎద్దడిపై ప్రభుత్వంపై మండిపడిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి.
Anantapur: సీమ రైతులకు 25 టీఎంసీల నీరు కేటాయించాలి వైఎస్సార్‌సీపీ నేత అనంత
Anantapur: ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు 50% లోటు వర్షపాతం నమోదైంది.సూపర్ ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో విఫలమైంది.పంటలు ఎండిపోవడంతో పాటు పశువులకు మేత దొరకక రైతులు వాటిని సంతల్లో అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.
జిల్లాకు కనీసం 16 టీఎంసీల నీరు కూడా కేటాయించలేదు(మరో 4–5 టీఎంసీలు వచ్చే అవకాశం ఉంది).శ్రీశైలం డ్యాంలో నీటి లభ్యత ఆశాజనకంగా ఉన్నందున, అక్కడ విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేసి ఆ నీటిని రాయలసీమ అవసరాలకు మళ్లించాలి.రాయలసీమకు మొత్తం 25 టీఎంసీల నీటిని తీసుకురావాలన్నారు.పట్టిసీమ నీటిని వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని రైతులను బెదిరించడం సరికాదు.ప్రభుత్వ వైఫల్యం
జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ శాసనసభలో కరువు, సాగునీటి సమస్యలను ప్రస్తావించలేదు.మార్చి వరకు తోడిన 53 టీఎంసీల నీరు ఏ చెరువుల్లో ఉందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
హార్టికల్చర్ హబ్ గురించి మాట్లాడటం కంటే, ఎండిపోతున్న పండ్ల తోటలు, ఆరుతడి పంటలను కాపాడటానికి తక్షణమే నీటిని విడుదల చేయాలన్నారు.పశుగ్రాసం పెంపొందించడానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలి, పంటలు వేయని రైతులకు ఆర్థిక సహాయం అందించి వలసలను నివారించాలని అనంత వెంకటరామిరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు.




