Ananthapur: అనంతపురం జిల్లాలో ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్!
Ananthapur: అనంతపురం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బ్యాలెట్ పెట్టెలను జేఎన్టీయూ స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. నవంబర్ 7న ఉదయం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.
Ananthapur: అనంతపురం జిల్లాలో ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్!
అనంతపురం: అనంతపురం జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 31 మండలాలకు గాను మూడు మండలాల్లో జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 28 మండలాల్లో పోలింగ్ నిర్వహించారు. జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
అదేవిధంగా 353 ఎంపీటీసీ స్థానాలకు 785 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా ఒకటి రెండు చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పటికీ, మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల సిబ్బంది ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి, పటిష్ట భద్రత మధ్య అనంతపురం జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఈ నెల 7వ తేదీన ఉదయం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నారు. దీంతో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.




