Ananthapur: అనంతపురం రూరల్‌లో ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్!

Ananthapur: అనంతపురం రూరల్ మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎస్పీ పి.జగదీష్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 5 Nov 2026 8:18 PM IST
Ananthapur
X

Ananthapur: అనంతపురం రూరల్‌లో ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్!

అనంతపురం: అనంతపురం రూరల్ మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ పి.జగదీష్ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉదయం నుంచి పోలింగ్ ముగిసే వరకు ఎన్నికలు జరిగే ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి భద్రతను పర్యవేక్షించారు. దీంతో రూరల్ మండల పరిధిలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రత కల్పించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM