Pamidi: పాండురంగ స్వామి ఆలయంలో వైభవంగా ఆషాఢ మాస బ్రహ్మోత్సవాలు!

Pamidi: అనంతపురం జిల్లా పామిడి పాండురంగ స్వామి ఆలయంలో ఆషాడ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐరావత వాహన సేవ మరియు స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగాయి.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 28 July 2026 10:59 PM IST
Pamidi
X

Pamidi: పాండురంగ స్వామి ఆలయంలో వైభవంగా ఆషాఢ మాస బ్రహ్మోత్సవాలు!

పామిడి: అనంతపురం జిల్లా పామిడి లో ఆషాడమాస బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం భక్తి శోభ నెలకొంది.భగవాన్ దాస్ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం నుండి పాండురంగ స్వామి వారు ఐరావత వాహనంపై పామిడి పుర వీధుల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

ఊరేగింపులో సన్నాయి మేళాలు, దిండి భజనలు సాగుతుండగా, భక్తులు గోవింద నామస్మరణతో స్వామి వారిని కొలిచారు. వీధులన్నీ భక్తి నామాలతో మార్మోగాయి.ఉదయం ఆలయంలో శాస్త్రోక్తంగా హోమక్రతువు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రుక్మిణి పాండురంగ స్వామి కల్యాణం వైభవంగా జరిపారు.

పెద్ద సంఖ్యలో భక్తులు తలంబ్రాలు వేసి స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు.ఈ కార్యక్రమంలో ఈఓ కృష్ణయ్య, ఆలయ అధ్యక్షులు టి.టి. నాగభూషణం రావు, శ్రీనివాస రావు, వెంకటేశ్వర రావు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story