Kadiri: కదిరిలో ఘనంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ!
Kadiri: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కదిరిలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Kadiri: కదిరిలో ఘనంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ!
కదిరి: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని కదిరి పట్టణంలో లా అండ్ ఆర్డర్ పోలీసులు మరియు ఎక్సైజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీ R&B బంగ్లా నుండి ప్రారంభమై వేమారెడ్డి సర్కిల్, టవర్ క్లాక్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.
అనంతరం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కదిరి డీఎస్పీ శ్రీ శివ నారాయణ స్వామి గారు, కదిరి టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ డి.వి. నారాయణ రెడ్డి గారు, ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వీరారెడ్డి గారు, ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్ శ్రీమతి భువనేశ్వరి గారు, రెడ్ సృజన్ సంస్థ డైరెక్టర్ శ్రీమతి భానూజ గారు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యువత సమాజ నిర్మాణంలో పోషించాల్సిన బాధ్యత గురించి వివరించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఓబులేసు డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు, వివిధ కళాశాలల విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల తయారీ, రవాణా, విక్రయం, నిల్వ మరియు వినియోగం ఎన్‌డీపీఎస్ చట్టం, 1985 (NDPS Act, 1985) ప్రకారం శిక్షార్హమైన నేరం. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందించి, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కదిరి టౌన్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.




