Sathya Sai: అంగన్‌వాడీల భారీ ధర్నా.. పెనుకొండలో కరపత్రాల ఆవిష్కరణ!

Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సిడిపిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో జులై 31న జరిగే కలెక్టరేట్ ధర్నా కరపత్రాలను విడుదల చేశారు.

K.UDAY BHANU, PENUKONDA
Published on: 30 July 2026 7:13 PM IST
Sathya Sai
X

Sathya Sai: అంగన్‌వాడీల భారీ ధర్నా.. పెనుకొండలో కరపత్రాల ఆవిష్కరణ!

శ్రీ సత్య సాయి జిల్లా: పెనుకొండ పట్టణంలోని సిడిపిఓ కార్యాలయం వద్ద రేపు అనగా జులై 31 వ తారీఖు న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా పెనుకొండ ప్రాజెక్ట్ కార్యదర్శి భావమ్మ కోశాధికారి మాబున్నీసా మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యొక్క సమస్యలు పరిష్కారం కొరకు రేపు కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు టీచర్లందరూ పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది.

ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చేసుకుందామని వారికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉష శోభ రాజేశ్వరి నిర్మల తదితరులు పాల్గొన్నారు.

K.UDAY BHANU, PENUKONDA

K.UDAY BHANU, PENUKONDA

Next Story