Anantapur: ఏపీ ఈసెట్ పరీక్షలు 23 నుంచి.. 33 వేల మందికి పైగా హాజరు
Anantapur: ఏపీ ఈసెట్ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం. రాష్ట్రవ్యాప్తంగా 94 కేంద్రాల్లో 33,751 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
Anantapur
Anantapur: జేఎన్టీయూ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి ఏపీ ఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శన రావు తెలిపారు. ఆర్యభట్ట ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
మొత్తం 33,751 మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తుల గడువు గత నెల మార్చి 28న ముగిసిందని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 94 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్‌లో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షలు ఈనెల 23న రెండు సెషన్లలో నిర్వహించబడతాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.




