Guntakal: దేవాదాయ శాఖ కమిషనర్ ఆలయ సందర్శన
Guntakal: గుంతకల్లు ఆలయంలో ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రత్యేక పూజలు.
Guntakal: దేవాదాయ శాఖ కమిషనర్ ఆలయ సందర్శన
గుంతకల్: స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనరు శ్రీ కె.రామచంద్ర మోహన్ మరియు కుటుంబ సభ్యులను ఆలయ ఈఓ శ్రీ మేడేపల్లి విజయ రాజు గారు , అనువంశిక ధర్మకర్త శ్రీమతి కె.సుగుణమ్మ గారు , గుంతకల్లు ఎమ్మెల్యే సోదరుడు శ్రీ గుమ్మనూరు నారాయణస్వామి గారు , , ప్రధాన అర్చకులు శ్రీ కే రాఘవాచార్యులు గారు , వేద పండితులు , అర్చకులు పూర్ణకుంభముతో ఘన స్వాగతం పలికారు అనంతరం శ్రీ స్వామి వారి శేష వస్త్రము , ప్రసాదం అందజేశారు మరియు నూతన ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు దేవాదాయ శాఖ ఉపకమిషనరు శ్రీ యం. రామాంజినేయులు, అనంతపురం జిల్లా దేవాదాయ సహాయ కమిషనరు శ్రీ గంజి మల్లికార్జున ప్రసాద్, కర్నూలు జువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ శ్రీ పాండురంగారెడ్డి గారు , గుంతకల్లు సమూహ దేవాలయాలు కార్యనిర్వహణాధికారి శ్రీ యం.మల్లికార్జున గారు, దేవాదాయ శాఖ ఉరవకొండ ఇన్స్పెక్టర్ శ్రీ మతి రాణి గారు దేవాదాయ శాఖ అధికారులు, శ్రీ హనుమాన్ సేవ సమితి గుంతకల్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




