Anantapur: అనంతపురంలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ

Anantapur: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 1 May 2026 3:41 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ

అనంతపూర్: ఏదైతే చేస్తామో అదే చెబుతాం.. చేసి చూపిస్తామని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు పూల నాగరాజుతో కలిసి ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తూ.. ప్రజా స్పందన తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ వెయ్యి రూపాయలు పింఛన్ పెంచడానికి జగన్ రెడ్డికి ఐదేళ్ల పట్టిందన్నారు. ఒక్క మాటతో వెయ్యి రూపాయలు అధికారంలోకి రాగానే పెంచామన్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అన్ని వర్గాల వారికి పింఛన్లు పెంచారన్నారు. తొలి ఐదు సంతకాలతో కీలకమైన హామీలు నెరవేర్చామన్నారు. మెగా డీఎస్పీ, మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నా క్యాంటీన్లు వంటివి ఎన్నో అమలు చేస్తున్నారన్నారు. రెండేళ్లలోనే అనేక ప్రతిష్టాత్మక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని.. గత ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. ఇది ప్రజల కోసం నిబద్ధతతో పని చేసే ప్రభుత్వమని.. ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story