Dharmavaram: ధర్మవరం రోడ్లపై మంత్రి సత్య కుమార్ హల్చల్!

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న పారిశుధ్య సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ ఉదయాన్నే పర్యటించారు.

PAMALA NAGENDRA, DHARMAVARAM
Published on: 22 May 2026 9:44 AM IST
Dharmavaram
X

Dharmavaram: ధర్మవరం రోడ్లపై మంత్రి సత్య కుమార్ హల్చల్!

శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ శుక్రవారం ఉదయం పర్యటించారు. పట్టణంలోని అంజుమన్ సర్కిల్ నుండి శ్రీదేవి థియేటర్ రోడ్డు డ్రైనేజీ కాలవలను పరిశీలించారు.అనంతరం ఎన్టీఆర్ సర్కిల్లో తోపుడు బండ్ల వ్యాపారులతో మాట్లాడుతూ స్థానిక సమస్యల గురించి తెలుసుకున్నారు.మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

PAMALA NAGENDRA, DHARMAVARAM

PAMALA NAGENDRA, DHARMAVARAM