Kadiri: కదిరిలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం!

Kadiri: 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు వంటి సానుకూల నిర్ణయాలు తీసుకున్నందుకు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఉద్యోగులు పాలాభిషేకం చేశారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 6 Sept 2026 11:22 PM IST
Kadiri
X

Kadiri: కదిరిలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం!

కదిరి: ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని కదిరి తాలూకా జేఏసీ నాయకులు పేర్కొన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కోరిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.

కదిరిలో ఆర్ & బి బంగ్లా నందు ఆదివారం రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి,ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి మరియు రాష్ట్ర జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారికి కదిరి శాసన సభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రెండు డిఏల చెల్లింపు, పిఆర్సి కమిషన్ఏర్పాటు నిర్ణయం,ఉద్యోగుల ఆరోగ్య చికిత్సలకు చెల్లింపులు, జనవరిలో సరెండర్ లీవ్ నగదు చెల్లింపు,పెన్షనర్లకు క్క్వాంటం అఫ్ పెన్షన్ పెంపు తదితర ఉద్యోగ ప్రయోజనాలపై అనుకూల నిర్ణయం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ధ్యాం క్యూ సీఎం సార్ అంటూ ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

భవిష్యత్తులో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కు రావలసిన అన్నింటినీ ముఖ్యమంత్రి నాయకత్వంలో నెరవేర్చుతారని అలాగే మంచి పిఆర్సి ని కూడా భవిష్యత్తులో ఉద్యోగులకు అందిస్తారని ఆశిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ ఆర్టీసీ ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మరియు ఉపాధ్యాయులు ఉద్యోగ సంఘ నాయకులు మరియు ఉద్యోగులు,మున్సిపాలిటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story