Anantapur: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం: ఐ.వి. సుబ్బారావు!

Anantapur: జర్నలిస్టుల హౌసింగ్, హెల్త్ స్కీమ్, పెన్షన్ సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 2న ‘కోరికల దినం’ నిర్వహిస్తున్నట్లు APUWJ రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి. సుబ్బారావు తెలిపారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 7 Sept 2026 4:22 PM IST
Anantapur
X

Anantapur: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం: ఐ.వి. సుబ్బారావు!

అనంతపురం: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా ‘కోరికల దినం’ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి. సుబ్బారావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో APUWJ ఆధ్వర్యంలో ‘కోరికల దినం’ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు ఐ వి సుబ్బారావు వెల్లడించారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల విషయంలో కూటమి ప్రభుత్వం మంచి పురోగతి సాధించిందని ఐ.వి. సుబ్బారావు తెలిపారు.

జర్నలిస్టుల సమస్యల్లో ఇంకా అనేక అంశాలు పరిష్కారం కావాల్సి ఉందన్నారు. జర్నలిస్టుల ఆక్సిడెంటల్ పాలసీని వెంటనే పునరుద్ధరించాలని, హెల్త్ స్కీమ్ అమలులో ఉన్న లోపాలను సరిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల కోసం హౌసింగ్ స్కీమ్‌ను వెంటనే అమలు చేయడంతో పాటు.. రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐ&పీఆర్ మంత్రి పార్థసారథి జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అమలులో జాప్యం జరుగుతోందని ఐ.వి. సుబ్బారావు అన్నారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

అక్టోబర్ 2వ తేదీ నుంచి జర్నలిస్టుల సమస్యలపై దశలవారీగా ఉద్యమం చేపడతామని APUWJ రాష్ట్ర అధ్యక్షులు స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విజయవాడలో భారీ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.ఇదిలా ఉండగా..నంద్యాలలో ఐన్యూస్ జర్నలిస్టుల అరెస్ట్‌ను APUWJ తీవ్రంగా ఖండించింది. ఎఫ్‌ఐఆర్ ఇవ్వకుండా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం బాధాకరమని ఐ.వి. సుబ్బారావు అన్నారు.వార్తపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే.. ఖండన తెలియజేయడం లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటి ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరించాలని సూచించారు.

జర్నలిస్టులను అర్ధరాత్రి, తెల్లవారుజామున వారి ఇళ్లకు పోయి అరెస్ట్ చేయడం సరికాదన్నారు.జర్నలిస్టుల అరెస్ట్

వ్యవహారంపై డీజీపీ వెంటనే జోక్యం చేసుకోవాలని APUWJ డిమాండ్ చేసింది. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని ఐ.వి. సుబ్బారావు కోరారు. ఈ కార్యక్రమంలో APUWJ రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి. సుబ్బారావు, జిల్లా గౌరవ అధ్యక్షులు భోగేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story