OD Cheruvu: పొగాకుకు దూరంగా.. ఆరోగ్యంగా ఉండండి: ఓ.డి.చెరువులో ర్యాలీ!

OD Cheruvu: శ్రీ సత్యసాయి జిల్లా ఓ.డి.చెరువులో పొగాకు వినియోగంపై అవగాహన ర్యాలీ. ఆరోగ్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో మానవహారం. పొగాకు రహిత సమాజం కోసం పిలుపు.

S.Firoz, Sri Sathya Sai
Published on: 30 May 2026 11:52 AM IST
OD Cheruvu
X

OD Cheruvu: పొగాకుకు దూరంగా.. ఆరోగ్యంగా ఉండండి: ఓ.డి.చెరువులో ర్యాలీ!

శ్రీ సత్యసాయి జిల్లా: ఓ.డి చెరువు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొని ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ భాను ప్రకాష్ మాట్లాడుతూ..పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం అంబేద్కర్ కూడలిలో మానవహారం నిర్వహించి, పొగాకు వినియోగాన్ని పూర్తిగా నివారించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పొగాకు రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. కార్యక్రమంలోవైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story