Kadiri: కదిరిలో బీడీ కార్మికుల కోసం రూ. 25 లక్షల సంక్షేమ నిధి ఏర్పాటు!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో బీడీ కార్మికుల సంక్షేమం కోసం సిమ్స్ హాస్పిటల్ ఎండీ బాదల్ నిసార్ యాసిన్ ఖాన్ రూ. 25 లక్షల నిధిని ప్రకటించారు.
Kadiri: కదిరిలో బీడీ కార్మికుల కోసం రూ. 25 లక్షల సంక్షేమ నిధి ఏర్పాటు!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని స్థానిక షాలిమార్ ఫంక్షన్ హాల్ నందు ఈరోజు బీడీ కార్మికుల సంక్షేమం, ఆరోగ్యం మరియు వారి కుటుంబాల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని సిమ్స్ హాస్పిటల్ MD, NYPSN ఫౌండర్ బాదల్ నిసార్ యాసిన్ ఖాన్ 25 లక్షల రూపాయల సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వారి కుటుంబాలలో ఆడబిడ్డ వివాహానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం, వారి కుటుంబాలలో దురదృష్టవశాత్తు కుటుంబ సభ్యులు దూరమైతే వారికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం, వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఉచిత కంటి ఆపరేషన్లు మరియు ఉచిత వైద్య సహాయం అందిస్తారని, విద్య పరంగా కూడా తనవంతు సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.
బీడీ కార్మికుల యొక్క సమస్యలను తెలుసుకొని తనవంతుగా దేవుడు తనకిచ్చిన దానిలో కొంత భాగాన్ని వారి సంక్షేమం కోసం వెచ్చిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు బీడీ కార్మికులు తమ యొక్క సమస్యలను వారికి తెలియజేశారు. అందులో కొన్నింటిని సత్వర పరిష్కారానికి హామీ ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సేవా కార్యక్రమంలో భారీగా హాజరైన బీడీ కార్మికులు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిమ్స్ హాస్పిటల్ సిబ్బంది, NYPSN వాలంటీర్లు మరియు పుర ప్రజలు పాల్గొన్నారు.




