Rayadurgam: భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆహార పొట్లాలు పంపిణీ

Rayadurgam: దివంగత బండి రాందాసప్ప వర్ధంతి సందర్భంగా సేవా భారత్ ట్రస్ట్, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిరుపేదలకు, నిరాశ్రయులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 5 July 2026 12:29 PM IST
Rayadurgam
X

Rayadurgam: భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆహార పొట్లాలు పంపిణీ

రాయదుర్గం: రాయదుర్గం పట్టణానికి చెందిన దివంగత బండి రాందాసప్ప గారి వర్ధంతి సందర్భంగా సేవా భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ పుణ్య కార్యక్రమాన్ని చేపట్టిన బండి రాందాసప్ప గారి కుమారుడు బండి భీమసేన,రజిని వీరి కుమారులు బండి కార్తీక్,భార్య సంధ్య బండి యోగేష్

రాయదుర్గం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పేదలు, నిరాశ్రయులు, అవసరమైన వారికి ఆహార పొట్లాలను అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా సేవా భారత్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జి. గంగారామ్ మాట్లాడుతూ, “మనిషి మరణించిన తరువాత కూడా ఆయన చేసిన మంచి పనులు, చూపిన విలువలు సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. బండి రాందాసప్ప గారి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ఆదర్శప్రాయమైనది. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదలకు అండగా నిలవాలని” కోరారు.

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM

Next Story