Anantapur: ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా ప్రజల మద్దతు కూటమికే!
Anantapur: ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా ప్రజల తీర్పు కూటమి వైపే ఉంటుందని అనంతపురంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు పూల నాగరాజు, ఎర్రసు ప్రతాప్ రెడ్డి బుధవారం ధీమా వ్యక్తం చేశారు.
Anantapur: ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా ప్రజల మద్దతు కూటమికే!
అనంతపురం: అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు పూల నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడటం వల్ల ప్రజలకు మరింత మేలు జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకులు రిగ్గింగ్, దాడులకు పాల్పడ్డారని పూల నాగరాజు ఆరోపించారు.ఇప్పటికైనా వైసీపీ నాయకులు తమ వైఖరిని మార్చుకుని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని సూచించారు.అనంతరం జిల్లా స్థానిక సంస్థల పరిశీలకులు ఎర్రసు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో ప్రజలు కూటమికి అఖండ మద్దతు తెలిపారని పేర్కొన్నారు.
కూటమికి అండగా నిలిచిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రేపు జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలోని ప్రతి కుటుంబ సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు లక్ష్మీపతి, బీజేపీ నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.




