Pamidi: పామిడిలో ఘనంగా భగవద్గీత జ్ఞాన యజ్ఞం: కర్మయోగంపై ప్రవచనం

Pamidi: అనంతపురం జిల్లా పామిడి శ్రీ అనఘా ఆలయంలో భగవద్గీత జ్ఞాన యజ్ఞం ఘనంగా జరిగింది. కర్మయోగంపై స్వామి వారి ప్రవచనాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 10 Aug 2026 7:21 AM IST
Pamidi
X

Pamidi: పామిడిలో ఘనంగా భగవద్గీత జ్ఞాన యజ్ఞం: కర్మయోగంపై ప్రవచనం

పామిడి: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో వెలసిన శ్రీ అనఘా ఆలయం ఆత్రేయ దత్త పాదుకా క్షేత్రం లో ఆత్మీయంగా "చిన్మయ మిషన్" ఆధ్వర్యంలో గీత జ్ఞాన యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.

శ్రీ గురు దత్త సేవ సమితి ఆలయ కమిటీ సభ్యులు M H లక్ష్మీనారాయ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భగవద్గీత మూడవ అధ్యాయం *'కర్మయోగం' పై ప్రత్యేక ప్రవచనాలు జరిగాయి.

ఈ సందర్భంగా చిన్మయ మిషన్ స్వామి మాట్లాడుతూ, మానవుడు ఫలాపేక్ష లేకుండా తన కర్తవ్యాన్ని నిష్కామంగా ఆచరించడమే కర్మయోగమని తెలిపారు. భగవద్గీతలోని సందేశాలను జీవితంలో ఆచరిస్తే మానవ జీవితం ధన్యమవుతుందని భక్తులకు సూచించారు.

శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆదేశాల మేరకు ఈ గీత జ్ఞాన యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ తెలిపారు. స్వామీజీ ఆశీస్సులతో ప్రతి నెలా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో పామిడి పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో గీత పారాయణం చేసి, స్వామి ప్రవచనాలను శ్రద్ధగా ఆలకించారు. చివరలో అన్నప్రసాద వితరణ జరిగింది.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story