Anantapur: ₹4.50 కోట్లతో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ భూమి పూజ నిర్వహణ
Anantapur: అనంతపురంలో ₹4.50 కోట్లతో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ.
Anantapur: ₹4.50 కోట్లతో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ భూమి పూజ నిర్వహణ
Anantapur: అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని ఫ్లైఓవర్, బళ్లారి బైపాస్ లోని, అన్న క్యాంటీన్ వద్ద స్వయం సహాయక సంఘాల కుటుంబాలు, వీధి వ్యాపారుల కోసం ఏర్పాటు చేయనున్న స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ అభివృద్ధి పనులకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ , మున్సిపల్ కమిషనర్, మెప్మా పిడి, టిడిపి నాయకులు పాల్గొన్నారు. 4 కోట్ల 50లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ద్వారా వీధి వ్యాపారులకు క్రమబద్ధమైన, సురక్షితమైన, పరిశుభ్రమైన వ్యాపార వాతావరణం కల్పించడంతో పాటు, స్వయం సహాయక సంఘాల కుటుంబాలకు మెరుగైన జీవనోపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పట్టణాల సమగ్ర అభివృద్ధితో పాటు వీధి వ్యాపారులు, స్వయం సహాయక సంఘాల కుటుంబాలకు మెరుగైన జీవనోపాధి కల్పించేలా ప్రత్యేక ప్రణాళికలు చేపట్టారు. అందులో భాగంగానే అనంతపురం నగరంలో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతపురం నగరాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడంతో పాటు, పేదలు, మహిళలు, స్వయం సహాయక సంఘాలు, వీధి వ్యాపారుల ఆర్థిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు.




