Anantapur: ₹45 లక్షలతో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ భూమిపూజ పూర్తి

Anantapur: అనంతపురంలో ₹45 లక్షలతో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటు. భూమిపూజ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 29 Aug 2026 10:27 AM IST
Anantapur
X

Anantapur: ₹45 లక్షలతో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ భూమిపూజ పూర్తి

Anantapur: అనంతపురం నగరంలో వీధి వ్యాపారులకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని ఫ్లైఓవర్, బళ్లారి బైపాస్‌లోని అన్న క్యాంటీన్ వద్ద స్వయం సహాయక సంఘాల కుటుంబాలు, వీధి వ్యాపారుల కోసం ఏర్పాటు చేయనున్న స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ భూమిపూజ నిర్వహించారు.

సుమారు 45 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనుల ద్వారా వీధి వ్యాపారులకు క్రమబద్ధమైన, సురక్షితమైన, పరిశుభ్రమైన వ్యాపార వాతావరణం అందుబాటులోకి రానుంది.అదే విధంగా స్వయం సహాయక సంఘాల కుటుంబాలకు మెరుగైన జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ మార్కెట్ దోహదపడుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పట్టణాల సమగ్ర అభివృద్ధితో పాటు వీధి వ్యాపారులు, స్వయం సహాయక సంఘాల కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి పేర్కొన్నారు.

అనంతపురం నగరాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడంతో పాటు పేదలు, మహిళలు, స్వయం సహాయక సంఘాలు, వీధి వ్యాపారులకు మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో పాటు మున్సిపల్ కమిషనర్, మెప్మా పీడీ, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story