Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లాలో జనతా వారధి కార్యక్రమం
Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లాలో 'జనతా వారధి' కార్యక్రమం.
Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లాలో జనతా వారధి కార్యక్రమం
Sri Sathya Sai: రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జనతా వారధి జిల్లా కన్వీనర్ తలమర్ల హరికృష్ణ అధ్యక్షతన జనతా వారధి కార్యక్రమం జరిగింది.
జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ గారిని మరియు డిఆర్ఓ కొండయ్య గారిని కలిసి హరికృష్ణ గారు మరియు బిజెపి నాయకులు వినతి పత్రం సమర్పించడం జరిగింది జిల్లావ్యాప్తంగా ఆహార తనిఖీ కి సంబంధించిన అధికారులు కల్తీ ఆహారాన్ని మరియు నాసిరకం ఆహార వస్తువులను తనిఖీ చేయాలని కోరారు.
జిల్లావ్యాప్తంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేసిన దాఖలాలు లేవని నాసిరకంగా ఆహార ఉత్పత్తులను తనిఖీ చేయడంలో సంబంధించిన అధికారులు నిర్లక్ష్య కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలకు గురికావాల్సి వస్తుందని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలకు అధికారులు చేపట్టాలని హరికృష్ణ కలెక్టర్ గారిని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కళ్యాణ్ కుమార్ ఎస్టి మోర్చా ప్రధాన కార్యదర్శి రాజేంద్ర నాయక్ ఎస్టి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ నాయక్ జిల్లా నాయకులు పోతులయ్య గారు ఐటీ సెల్ కన్వీనర్ భాస్కర్ జి గారు తదితరులు పాల్గొన్నారు.




