Anantapur: గ్రామ స్థాయికి బిజెపి..జనతా వారధి'తో జనంలోకి కమలం నేతలు!
Anantapur: రాష్ట్ర బిజెపి కార్యాలయంలో 'జనతా వారధి' కార్యక్రమంపై సమీక్షా సమావేశం జరిగింది.
Anantapur: గ్రామ స్థాయికి బిజెపి..జనతా వారధి'తో జనంలోకి కమలం నేతలు!
అనంతపూర్: అనంతపురం జిల్లా జనతా వారధి రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన "జనతా వారధి" సమీక్ష సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారి కార్యాలయంలో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఇన్‌చార్జ్ మరియు జనతా వారధి రాయలసీమ జోన్ ఇన్‌చార్జ్ శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారు కూడా పాల్గొన్నారు.
అలాగే ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సురేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి లక్ష్మి ప్రసన్న గారు, శ్రీమతి రెడ్డి పావని గారు,ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ గోపి శ్రీనివాస్ గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి. సురేష్ గారు,మాజీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు శ్రీ బాజీ గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జనతా వారధి కార్యక్రమాన్ని బలోపేతం చేయడం, పార్టీ కార్యకలాపాలను గ్రామ స్థాయికి విస్తరించడం మరియు ప్రజలకు చేరువయ్యే విధంగా వివిధ కార్యాచరణలపై చర్చించారు. నాయకులు రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తూ, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.




