Dharmavaram: మానవత్వం చాటుకున్న బీజేపీ ఇన్‌చార్జ్ చెన్నా ఆదినారాయణ!
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కుటుంబ సభ్యులు లేని నిరుపేద యువకుడు పురుషోత్తం అంత్యక్రియలను బీజేపీ ఇన్‌చార్జ్ చెన్నా ఆదినారాయణ దగ్గరుండి నిర్వహించారు.
Dharmavaram: మానవత్వం చాటుకున్న బీజేపీ ఇన్‌చార్జ్ చెన్నా ఆదినారాయణ!
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం 32 వ వార్డు గిర్రాజ్ కాలనీలో పురుషోత్తం (36)అనే ఓ యువకుడు అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. బాధితుడికి సంబంధించిన వారెవరు లేకపోవడంతో అంత్యక్రియలకు ఎవరు ముందుకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న అవార్డు బీజేపీ ఇన్చార్జ్ చెన్న ఆదినారాయణ స్పందించాడు.చెన్న ఆదినారాయణ వార్డు ప్రజల సహకారంతో 12 వేల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి పురుషోత్తం కు దగ్గర ఉండి అంత్యక్రియలు నిర్వహించారు.చెన్నా ఆదినారాయణ చూపిన మానవతా దృక్పథానికి వార్డు ప్రజలు అభినందించారు.




