Kadiri: రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన బ్లూమూన్ విద్యార్థులు!

Kadiri: యానంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-25 క్రీడా పోటీల్లో కదిరి బ్లూమూన్ విద్యార్థులు కబడ్డీలో ప్రథమ, ఫుట్‌బాల్‌లో ద్వితీయ స్థానం సాధించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 16 Nov 2026 8:04 PM IST
Kadiri
X

Kadiri: రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన బ్లూమూన్ విద్యార్థులు!

సత్య సాయి జిల్లా: కదిరి బ్లూమూన్ కళాశాలలో కౌన్సిల్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అండర్ 25 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంటర్ డిస్టిక్ కబడ్డీ,వాలీబాల్,కోకో బ్యాడ్మింటన్,పుట్ బాల్ ఛాంపియన్షిప్ 2026-27, కాకినాడ జిల్లాలోని యానం వైయస్సార్ ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో ఈ నెల 13,14,15వ తేదిన నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో బ్లూమూన్ డిగ్రీ, ఇంటర్ కాలేజ్ విద్యార్థులు కబడ్డీ పోటీలలో పాల్గొని అత్యుత్తమ క్రీడా ప్రదర్శన కనబరిచి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలవడం జరిగింది.

ఫుట్బాల్ క్రీడా విభాగంలో బ్లూమూన్ కలశాలల విద్యార్థులు పాల్గొని రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలవడం జరిగిందని మా విద్యాసంస్థలలో చక్కటి క్రమశిక్షణ కలిగిన విద్యతోపాటు అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేసే విధంగా క్రీడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని బ్లూమూన్ విద్యాసంస్థల అధినేత శ్రీ ఎం. శివశంకర్ గారు తెలియజేశారు, గెలుపొందిన విద్యార్థుల అభినందన సభలో విద్యార్థులను ఉద్దేశించి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఆర్.వెంకట రెడ్డి గారు మా విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించడం అభినందించదగ్గ విషయమని తెలియజేశారు.

విద్యార్థులకు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎం .మనోహర్ రెడ్డి గారు ప్రశంస పత్రాలను, మెడల్స్ ను అందజేశారు, రాష్ట్రస్థాయిలో మంచి క్రీడా ప్రతిభ కనబరిచిన 8 మంది విద్యార్థులు పవన్ కుమార్ రెడ్డి, రియాజ్, గణేష్, యస్వంత్, వేంకటచలపతి, మీర్ షఫీ, భానుప్రకాష్, నూర్ అబ్జల్ లు జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేయడం జరిగిందని వ్యాయామ ఉపాధ్యాయులు సి.విజయ్ కుమార్, జి.రామాంజుల రెడ్డి, డ్యానియల్, కుమార్ లు తెలియజేసారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI