Sri Sathya Sai: రోడ్డు భద్రతకు భరోసా.. పోలీసులకు అందిన ఆధునిక సామగ్రి!

Sri Sathya Sai: జిల్లాలో రోడ్డు భద్రతను పటిష్టం చేసేందుకు ముందుకు వచ్చిన నేషనల్ హైవేస్ అధికారులు.

MARUTHI, PUTTAPARTHI RURAL
Published on: 28 April 2026 2:00 PM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: రోడ్డు భద్రతకు భరోసా.. పోలీసులకు అందిన ఆధునిక సామగ్రి!

Sri Sathya Sai: కలెక్టరేట్ ఆవరణంలో జాతీయ, రాష్ట్ర రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మరియు అత్యవసర సమయాల్లో వినియోగించడానికి వీలుగా జిల్లా పోలీసులకు రోడ్డు భద్రతా సామగ్రిని అందజేశారు. నేషనల్ హైవేస్ (R&B) ఎస్.ఈ (SE) జి. సంజీవరాయుడు గారు సమకూర్చిన 245 కోన్లు, 245 రిఫ్లెక్టివ్ జాకెట్లు, 90 టార్చ్ లైట్లను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారి ద్వారా జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ గారికి అందజేశారు.ఈ సందర్భంగా ఎస్.ఈ సంజీవరాయుడు గారిని కలెక్టర్ అభినందించగా, సామగ్రిని అందజేసినందుకు ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆర్టీఓ కరుణ సాగర్ ,కదిరి మోటార్స్ వాహన ఇన్‌స్పెక్టర్ వరప్రసాద్, NH DE గిద్దయ్య,ఇతర అధికారులు పాల్గొన్నారు.

MARUTHI, PUTTAPARTHI RURAL

MARUTHI, PUTTAPARTHI RURAL

Next Story