Gooty: ఆశానగర్‌లో ఇంట్లో చోరీ.. వెండి, నగదు అపహరణ!

Gooty: అనంతపురం జిల్లా గుత్తి పట్టణ ఆశానగర్‌లో విశ్రాంతి ఉద్యోగి రంగస్వామి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 3 Aug 2026 9:41 AM IST
Gooty
X

Gooty: ఆశానగర్‌లో ఇంట్లో చోరీ.. వెండి, నగదు అపహరణ!

Gooty: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆశానగర్ లోని విశ్రాంతి ఉద్యోగి రంగస్వామి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడిన ఘటన కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇంటి యజమానులు బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలను పగులగొట్టారు. అందులో ఉన్న వెండి నగలు, నగదు ఎత్తుకెళ్లారు.

ఇంటికి తిరిగి వచ్చిన యజమానులు తలుపులు, బీరువాలు పగిలి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న గుత్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వేలిముద్రలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనతో ఆశానగర్ లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు పహారా పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story