Pamidi: దొంగల హల్చల్ తిరుపతి వెళ్లిన సమయంలో ఇల్లు ఊడ్చేశారు!
Pamidi: అనంతపురం జిల్లా పామిడిలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ. తిరుపతి వెళ్లిన కుటుంబం; 5 తులాల బంగారం, డైమండ్స్, నగదుతో రూ.6 లక్షల సొత్తు అపహరణ.
Pamidi: దొంగల హల్చల్ తిరుపతి వెళ్లిన సమయంలో ఇల్లు ఊడ్చేశారు!
Pamidi: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు.
ముంజు థియేటర్ సమీపంలో నివాసముంటున్న నరేందర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దైవదర్శనం నిమిత్తం నరేందర్ కుటుంబం తిరుపతి వెళ్లారు. ఇంటికి తాళాలు వేసి ఉండటంతో ఇదే అదునుగా భావించిన దుండగులు రాడ్ తో తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు.
బీరువాలో ఉన్న 5 తులాల బంగారు నగలు, 10 తులాల వెండి, 80 వేల నగదు, 5 లక్షల విలువైన డైమండ్స్ ను ఎత్తుకెళ్లారు. మొత్తం సుమారు 6 లక్షల రూపాయల విలువైన సొత్తు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు.
ఇదే ఏరియాలో రోజు మార్చి రోజు చోరీలు జరుగుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఘటనపై బాధితుడు నరేందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




