Puttaparthi: పుట్టపర్తిలో ఉచిత స్వయం ఉపాధి కోర్సులు.. భోజనం, వసతి కూడా ఫ్రీ!

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) ఉచిత శిక్షణ ఇస్తోంది.

MARUTHI, PUTTAPARTHI RURAL
Published on: 13 May 2026 5:41 PM IST
Puttaparthi
X

Puttaparthi: పుట్టపర్తిలో ఉచిత స్వయం ఉపాధి కోర్సులు.. భోజనం, వసతి కూడా ఫ్రీ!

Puttaparthi: పుట్టపర్తిలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో వివిధ ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కెనరా బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శాంతి ప్రియ తెలిపారు. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ శిక్షణలకు శ్రీ సత్యసాయి జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత అర్హులని, 19 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండటంతో పాటు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని సూచించారు. శిక్షణ పూర్తిగా ఉచితంగా అందించబడుతుందని, శిక్షణ కాలంలో ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.

శిక్షణ పొందదలచిన వారు నిర్దిష్ట దరఖాస్తు ఫారమ్‌ను పూరించి సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తులో అభ్యర్థి పేరు, కుటుంబ వివరాలు, విద్యార్హతలు, వృత్తి ఆసక్తులు, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యార్హత ధ్రువపత్రాలు, బ్యాంక్ పాస్‌బుక్ ప్రతులు, ఫోటోలు వంటి పత్రాలను జతచేయాలని సూచించారు.

సంస్థ ఆధ్వర్యంలో రెండు వీలర్ మెకానిక్ సర్వీసింగ్, సెల్‌ఫోన్ సర్వీసింగ్ మరియు మరమ్మతులు, ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ, ఎలక్ట్రికల్ మోటార్ వైండింగ్, ప్లంబింగ్ మరియు శానిటరీ, ఎలక్ట్రికల్ మోటార్ రీవైండింగ్ మరియు పంప్ సెట్ రిపేర్, టైలరింగ్ మరియు డ్రస్ డిజైనింగ్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, సీసీటీవీ కెమెరా ఇన్‌స్టాలేషన్ సర్వీసింగ్ వంటి పురుషుల శిక్షణ కోర్సులు నిర్వహించనున్నారు.

అదేవిధంగా మహిళల కోసం టైలరింగ్ మరియు డ్రస్ డిజైనింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్, పెళ్లికూతురు మేకప్, మెహంది వర్క్, జ్యూట్ బ్యాగ్ తయారీ, కాగితాల బ్యాగుల తయారీ, మసాలా పొడుల తయారీ, అగరబత్తి తయారీ, క్రొవ్వొత్తుల తయారీ, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, పచ్చళ్ల మరియు మసాలా పొడుల తయారీ వంటి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కోర్సుల వ్యవధి 12 రోజుల నుంచి 38 రోజుల వరకు ఉండనుందని వెల్లడించారు.

MARUTHI, PUTTAPARTHI RURAL

MARUTHI, PUTTAPARTHI RURAL

Next Story