Anantapur: కార్పొరేషన్లో ఎన్నికల హడావుడి: ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ!
Anantapur: అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 18న నామినేషన్లు, 28న పోలింగ్, 30న ఫలితాలు వెలువడనున్నాయి.
Anantapur: కార్పొరేషన్లో ఎన్నికల హడావుడి: ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ!
Anantapur: అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల హడావుడి మొదలైంది.నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో వివిధ పార్టీలకు చెందిన ఆశావహులు నామినేషన్ పత్రాలను తీసుకుంటూ బిజీగా మారారు.మరోవైపు నామినేషన్ల దాఖలుకు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు.
నామినేషన్ల దాఖలుకు సమయం తక్కువగా ఉండటంతో పత్రాల సేకరణ, ఇతర ఏర్పాట్లలో హడావుడి కనిపిస్తోంది.అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 62 స్థానాలు ఉండటంతో ఆయా స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఇక అధికార కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయి.నేటి నుంచి రేపటిలోగా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.మొత్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడం, సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతుండటంతో అనంతపురం నగరంలో రాజకీయ సందడి నెలకొంది.ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది.




