Gooty: జాతీయ రహదారిపై దారుణం కారులో సజీవదహనమైన వ్యక్తి!
Gooty: అనంతపురం జిల్లా గుత్తి-తాడిపత్రి జాతీయ రహదారిపై ఘోర ప్రమదం జరిగింది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఒక వ్యక్తి సజీవదహనం అయ్యాడు.
Gooty: జాతీయ రహదారిపై దారుణం కారులో సజీవదహనమైన వ్యక్తి!
Gooty: గుత్తి-తాడిపత్రి జాతీయ రహదారిపై దారుణ ఘటన
కారులో సజీవదహనమైన వ్యక్తి, కారు పూర్తిగా దగ్ధం
అనంతపురం జిల్లా గుత్తి లో గుత్తి-తాడిపత్రి జాతీయ రహదారి పై దారుణ ఘటన చోటుచేసుకుంది.
67వ జాతీయ రహదారిపై టి. కొత్తపల్లి గ్రామ సమీపంలో వెళ్తున్న ఏపీ09 సీఎం 264 నంబర్ గల కారు అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
ఈ ఘటనలో కారులో ఉన్న ఒక వ్యక్తి సజీవ దహనమైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
సమాచారం అందుకున్న వెంటనే గుత్తి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఘటనా స్థలంలో డీజిల్ క్యాన్లు కనిపించడంతో కారుపై ఎవరైనా డీజిల్ పోసి నిప్పంటించి ఉండవచ్చనే కోణంలో కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇది ప్రమాదమా లేదా హత్యా అనే అంశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మృతుడి గుర్తింపు, ఘటనకు గల ఖచ్చితమైన కారణాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.




