Gorantla: బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం
Gorantla: శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో బాల్య వివాహాల నిర్మూలనపై భారీ అవగాహన కార్యక్రమం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 'బాలికా శక్తి చైతన్య రథం' ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్న అధికారులు.
Gorantla: బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం
గోరంట్ల: బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు శ్రీ సత్యసాయి జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో గోరంట్ల పట్టణంలో బాలికా శక్తి చైతన్య ప్రచార రథం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు, ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రమీల సూచనల మేరకు కొలిమి చింతమాను వీధి, పూలేరు రోడ్‌లోని సంచార జాతుల నివాస ప్రాంతం, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమాలు చేపట్టారు.
Next Story




